శనివారం 23 జనవరి 2021
Crime - Dec 21, 2020 , 17:25:15

ఐదేండ్ల బాలిక కిడ్నాప్‌.. లైంగిక దాడి చేసి హత్య

ఐదేండ్ల బాలిక కిడ్నాప్‌.. లైంగిక దాడి చేసి హత్య

చండీగఢ్‌: ఐదేండ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశాడు. హర్యానాలోని జజ్జర్ నగరంలో ఈ దారుణం జరిగింది. పొరుగున ఉంటున్న 30 ఏండ్ల వ్యక్తి ఆదివారం రాత్రి బాలికను ఆమె ఇంటి నుంచి ఎత్తుకొచ్చాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబుతుందన్న భయంతో ఆ పాపను చంపేశాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేర చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో సోదా చేయగా బాలిక మృతదేహం కనిపించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బాలిక తండ్రి వలస కార్మికుడని, పని నిమిత్తం జజ్జర్‌ నగరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo