Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
గురువారం రాత్రి మండి (Mandi) జిల్లాలోని సుందర్ నగర్ – కర్సోగ్ రహదారిపై ఖుషాలా సమీపంలో ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సుందర్ నగర్ కు చెందిన లాలా రామ్ (50), రూప్ లాల్ (55), సునీల్ కుమార్ (35), గోబింద్ రామ్ (60), మోహ్నా (55)గా గుర్తించారు. వీరంతా కమ్రునాగ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటన సిమ్లా (Shimla) జిల్లాలోని కుమార్ సైన్ తహసీల్ లో చోటు చేసుకుంది. కుమార్ సైన్ – కీర్తి లింక్ రోడ్డులో ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో రాకేష్ కుమార్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Upasana | మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన
Heavy Rains | వరదలకు 145 మంది బలి.. అతలాకుతలమైన హిమాచల్
Cheetah | కూనో పార్కులో మరో చీతా మృతి.. 4 నెలల్లో ఎనిమిదో ఘటన