Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు పెళ్లైన పదేళ్ల తర్వాత తొలిసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ (mega princess) రాకతో మెగాస్టార్ ఇంట సందడి నెలకొంది.
పాప పుట్టాక చరణ్ దంపతులు చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇటీవలే సాంప్రదాయ బద్ధంగా మెగా వారసురాలికి ‘క్లింకారా’ (Klin Kaara) అని నామకరణం కూడా చేశారు. కాగా, తమ చిన్నారి కోసం చరణ్-ఉప్సీ ప్రత్యేక గదిని (Special Room) సిద్ధం చేశారు. తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో గదిని సిద్ధం చేశారు. ఈ గదిని ఫారెస్ట్ థీమ్ తో రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉప్సీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Also Read..
Samantha Ruth Prabhu | సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సమంత.. క్లారిటీ ఇచ్చిన నటి హెయిర్ స్టైలిస్ట్
School Building Washed Away | వరద నీటిలో కొట్టుకుపోయిన పాఠశాల.. ఎక్కడంటే..?
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో వరదలు ఇంత విధ్వంసం సృష్టించాయా?.. వీడియో వైరల్