Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. సినిమాలకు విరామం తీసుకుంటోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై సామ్ ఇప్పటి వరకూ స్వయంగా ప్రకటించలేదు. తాజాగా, ఈ అంశంపై ఆమె హెయిర్ స్టైలిస్ట్ (hair stylist) రోహిత్ భట్కర్ (Rohit Bhatkar) స్పష్టతనిచ్చారు. సమంతతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసిన రోహిత్.. ఆమె వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టారు.
‘2 సంవత్సరాలు. 1 సంచలనాత్మక మ్యూజిక్ వీడియో.. 3 సినిమాలు 7 బ్రాండ్ కాంపెయిన్స్, రెండు ఎడిటోరియల్స్. జీవితకాల జ్ఞాపకాలు. బాధ, వేదన, కన్నీళ్లు చూశాము. మీతో ఎంత అందమైన ప్రయాణం. కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వైద్యం తీసుకునే సమయంలో మీకు మరింత బలం, శక్తి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
గత కొన్నిరోజులుగా సమంత మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘యశోద’ చిత్రం తర్వాత మయోసైటిస్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది కూడా. ఆ తర్వాత శాకుంతలం పూర్తి చేసింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’(Citadel) వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసేసింది.
అయితే మయోసైటిస్ నుంచి సామ్ ఇంకా పూర్తిగా కోలుకోలేని కారణంగా.. తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఒక ఏడాది పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ (break from acting) ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తన తదుపరి ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై రోహిత్ భట్కర్ స్పష్టతనిచ్చారు.
Also Read..
Vinesh Phogat | వినేశ్ కు నోటీసులు జారీ చేసిన యాంటీ-డోపింగ్ ఏజెన్సీ
School Building Washed Away | వరద నీటిలో కొట్టుకుపోయిన పాఠశాల.. ఎక్కడంటే..?
Delhi Floods | సుప్రీం కోర్టు, రాజ్ ఘాట్ ను ముంచెత్తిన వరద