Vinesh Phogat | వినేశ్ కు నోటీసులు జారీ చేసిన యాంటీ-డోపింగ్ ఏజెన్సీ
Vinesh Phogat | భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)కు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (National Anti Doping Agency)నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనల (Anti-Doping Rules) ఆవశ్యకతను పాటించడంలో పూర్తిగా విఫలమైనందుకు నోటీసులు జారీ చేసింది.
Vinesh Phogat | భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)కు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (National Anti Doping Agency) నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనల (Anti-Doping Rules)
ఆవశ్యకతను పాటించడంలో పూర్తిగా విఫలమైనందుకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు ఫొగాట్ కు రెండు వారాల గడువు ఇచ్చింది.
డోపింగ్ నిరోధక నియమాలు పాటించడంలో వినేశ్ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని నోటీసుల్లో పేర్కొంది. తమ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ లో వినేశ్ పేరును చేర్చినట్లు 2022 మార్చి, 2022 డిసెంబరులో ఈ-మెయిల్ చేసినట్లు తెలిపింది. యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం.. ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయం ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. చెప్పిన ప్రదేశంలో చెప్పిన టైంకి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
అయితే, వినేశ్ ఇటీవలే ఇచ్చిన ఫైలింగ్ లో జూన్ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపట్ లో టెస్టింగ్ కు అందుబాటులో ఉంటానని చెప్పినట్లు ఏజెన్సీ గుర్తు చేసింది. దీంతో వినేశ్ చెప్పిన సమయానికి డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్లను ఆ ప్రదేశానికి పంపినట్లు తెలిపింది. అయితే, ఆ లొకేషన్ లో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు టెస్టింగ్ చేయలేకపోయారని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే వినేశ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని ఏజెన్సీ నోటీసుల్లో తెలిపింది. ఈ నోటీసులపై 14 రోజుల్లో తన స్పందన తెలియజేయాలని వినేశ్ ను ఏజెన్సీ ఆదేశించింది.
Also Read..
School Building Washed Away | వరద నీటిలో కొట్టుకుపోయిన పాఠశాల.. ఎక్కడంటే..?
Delhi Floods | సుప్రీం కోర్టు, రాజ్ ఘాట్ ను ముంచెత్తిన వరద
Hyderabad | కార్లు లీజుకు ఇస్తున్నారా? ఇలాంటి మోసగాళ్లు ఉంటారు జాగ్రత్త!!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

