School Building Washed Away | రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. లఖింపుర్ ఖేరీ (Lakhimpur Kheri) జిల్లాలోని శారదా నది (Sharda River) ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కర్దాహియా మన్ పూర్ (Manpur Kardahiya) గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నదిలో కొట్టుకుపోయింది.
ఆ సమయంలో పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, వరద ఉధృతి కారణంగా వారం రోజుల్లోనే దాదాపు డజనుకు పైగా ఇళ్లు, గుడిసెలు కొట్టుకుపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని వాపోయారు.
Also Read..
Delhi Floods | సుప్రీం కోర్టు, రాజ్ ఘాట్ ను ముంచెత్తిన వరద
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో వరదలు ఇంత విధ్వంసం సృష్టించాయా?.. వీడియో వైరల్
Delhi floods | ఇంకా తగ్గని యమునా నది ఉధృతి.. ఢిల్లీ ప్రజలకు తాగునీటి కష్టాలు