సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 14, 2020 , 18:10:22

చేపల వలలో చిక్కుకొని మత్స్యకారుడి మృతి

చేపల వలలో చిక్కుకొని మత్స్యకారుడి మృతి

నిజామాబాద్‌ : చేపల వేట కోసం వేసిన వల అతడి ప్రాణాలనే బలితీసుకున్న విషాద ఘటన  జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన తోకల లక్ష్మణ్ 36)అనే మత్స్యకారుడు గ్రామ శివారులోని నామన్ చెరువులో చేపలు పట్టేందుకు చెరువులో వల వేశాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అదే వలలో కాలు చిక్కుకొని మృతి చెందినట్లు లక్ష్మణ్ భార్య గంగామణి తెలిపింది. గంగామణి ఫిర్యాదు మేరకు రెంజల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ దావఖానకు తరలించినట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.


logo