Woman SI Tweet | ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఓ మహిళను ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. గతంలో కూడా దాడి చేసి కొట్టాడు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిత్యం తాగొచ్చి గొడవ పడుతుంటాడని తన బాధను వెల్లగక్కింది.
ట్విట్టర్లో ఆమె రాసిన వివరాల ప్రకారం.. బర్వాలా గ్రామానికి చెందిన డోలీ తెవాటియా ఢిల్లీ పోలీసు విభాగంలో మహేంద్ర పార్క్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆదివారం నాడు ఆమె భర్త తరుణ్ మద్యం మత్తులో కొందరు అనుచరులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఆమె సోదరిపై కూడా దాడి చేశాడు. ఇంతకుముందు సెప్టెంబర్ 4 తేదీన కూడా దాడి చేసినట్లు డోలీ తెవాటియా ఆరోపించారు.
పొరుగువారి ఇంట్లో అమర్చిన కెమెరాలో సీసీటీవీ ఫుటేజీని డోలీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇంటి బయట పార్క్ చేసిన కారును తరుణ్ మొదట ఢీకొట్టినట్లు ఈ ఒకటిన్నర నిమిషాల వీడియోలో కనిపిస్తున్నది. వెళ్తూవెళ్తూ మరోసారి కారును ఢీకొట్టాడు. వెంట్రుకలు పట్టుకుని లాగి కొట్టాడు. నేలపై పడేశాడు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఆదివారం రాత్రి నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమె భర్త న్యాయవాది వృత్తిలో ఉండటంతో ఆయనపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఆలిండియా బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది.
I am SUB-Inspector in Delhi Police. Presently on maternity leave. From several months I am facing abuse from my husband advocate Mr. Tarun Dabas. Today he beat me in broad daylight. He is still roaming free. Please ensure action @PMOIndia @HMOIndia @CMOfficeUP @CMODelhi pic.twitter.com/7wVII5fEwI
— Doli Tevathia (@TevathiaDoli) December 12, 2022