IFS Officers Transfers | తెలంగాణలో పలువురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు (IFS) బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్వర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీఎఫ్‌వో పద్మజారాణిని సిద్దిపేట డీఎఫ్గా ప్రభుత్వం బదిలీ చేసింది. నాగర్ కర్నూల్ డీఎఫ్‌వోగా పని చేస్తున్న రోహిత్ గోపిడిని రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఊట్నూర్ ఎఫ్‌డీవో రేవంత్ చంద్రను నాగర్ కర్నూల్ డీఎఫ్‌వోగా, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ బొబడేను నిర్మల్ డీఎఫ్గా నియమించింది. నారాయణపేట ఎఫ్‌డీవో కేఏవీఎస్ ప్రసాద్‌రెడ్డిని సంగారెడ్డి డీఎఫ్‌వోగా బదిలీ చేసింది. డీ సుధాకర్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి డీఎఫ్‌వోగా, ఏసీఎఫ్ సీ శ్రీధర్‌రెడ్డిని ఎఫ్సీఆర్ఐ ములుగు జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.