నాగర్‌కర్నూల్ : ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసురుతుంది. బాధితుల నుంచే వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్న ఏసీబీ, అవినీతి అధికారులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంటున్నారు.
తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎద్దుల వెంకటేశ్వర్లు ( ADE Venkateshwarlu ) లంచం ( Bribe ) తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన బాధితుడు తన ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో పాటు, తన పేరుపై మీటర్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాడు.
దీంతో రూ. 20 వేలు డిమాండ్ చేసిన ఏడీఈ మంగళవారం రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏడీఈని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వెల్లడించారు.