రామవరం, డిసెంబర్ 10 : ప్రతి ఒక్కరూ ఇంటి నుండి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించి రావాలని, రక్షణ అనేది ఇంటి నుండే మొదలు పెడదామని జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్.దామోదర్ రావు అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్లో వర్క్ 56వ యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ -2025, వార్షిక రక్షణ పక్షోత్సవాల కార్యక్రమానికి కన్వీనర్ అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ యాక్టింగ్, ఎం.వీ.నరసింహారావు, వర్క్ షాప్ జనరల్ మేనేజర్ దామోదర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వర్క్ షాప్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇండోర్, ఔట్డోర్, ఫ్యాబ్రికేషన్ పంపు సెక్షన్, మిషన్ సెక్షన్ అన్ని సెక్షన్ల ఉద్యోగులను సేఫ్టీకి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. పనులు ప్రారంభించే ముందు పీపీఈ కిట్టు ధరించి డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ప్రమాద నివారణ ప్రతిజ్ఞ ప్రతిరోజు చేయాలన్నారు.
ఎస్.ఓ.పి, ఎస్.ఎం.పీ, ప్రతిరోజు ఆచరణలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి స్పాట్ గిఫ్ట్స్ఇచ్చారు. అలాగే కాలనీలో క్వార్టర్స్ నందు అవగాహన కలిగిన బెస్ట్ హౌస్ ఎంపిక చేసిన C-2 హౌస్ వారికి T-2 హౌస్ వారికి బహుమతులు అందజేశారు. టెక్నీషియన్లకు, సూపర్వైజర్స్ ఇన్చార్జిలకు వారు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏరియా వర్క్ షాప్ హెచ్ఓడీ క్రిష్టఫర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, వర్క్ షాప్ ఉద్యోగులందరు ఎన్.దామోదర్ రావును శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం ఈ అండ్ ఎం సూర్యనారాయణ రాజు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఎం. ఏఎస్ఓ వెంకటేశ్వరరావు, 56వ వార్షిక రక్షణ పక్షోత్సవముల- 2025 సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈ. కృష్ణారెడ్డి, ఈ అండ్ ఎం ఎస్ టి పి పి, జి.దామోదర్, SE (E&M)CHP.Yld, డాక్టర్ కే.విజయ్ కుమార్, Med.Sup,Kgm Area, కె.సుధాకర్,WMI,(Elec)MNG, జి.నాగ సాయి సందీప్, WMI,(Mech), వీరితో పాటు వర్క్ షాప్ హెచ్.ఓ.డి, జె.క్రిస్టఫర్ డీజీఎం, బోడా శంకర్, DySe, టీ.అనిల్, ఏ.ఉపేందర్ బాబు, భరత్ చంద్ర, సేఫ్టీ ఆఫీసర్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎండి సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణ, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, సేఫ్టీ కమిటీ మెంబర్స్, సూపర్వైజర్స్ ఇన్చార్జి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు డి.భానుచందర్, రోషన్, సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఎస్డి.యాకుబుద్దీన్, సలిగంటి తిరుపతి, బాబుదిన్, కరుణాకర్, గుమ్మడి మురళి, జూనియర్ అసిస్టెంట్ సీహెచ్.కెనడి, ఎలక్ట్రిషన్ అలీ బేగ్, శ్రీకాంత్ శర్మ, ఐ మంత్స్, టెక్నీషియన్స్, ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిస్లు, డి.ఎల్.ఆర్, కార్మికులు పాల్గొన్నారు.

Ramavaram : రక్షణ అనేది ఇంటి నుండే మొదలుపెడదాం : ఎన్.దామోదర్ రావు