అమరావతి : ఏపీలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా (Chittoor District ) నగరి మండలం తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయని వివరించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు సంతానం, శంకర్, మరొకరు తమిళనాడు వాసి అరుణ్ మృతి చెందారని వెల్లడించారు. గాయపడిన ముగ్గురూ తమిళనాడు వాసులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.