College Student | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై ఇనుపరాడ్డు (Iron Rod)తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నగరంలోని అరబిందో కళాశాల (Aurobindo College) సమీపంలోని విజయ్ మండల్ పార్క్ లో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని నగరంలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతోంది. తన 25 ఏళ్ల స్నేహితుడితో కలిసి అరబిందో కళాశాల సమీపంలోని పార్కుకు వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినిపై ఆమె స్నేహితుడు రాడ్డుతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ‘దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్ (Malviya Nagar) లోని అరబిందో కళాశాల సమీపంలోని పార్కులో యువతి మృతదేహం లభ్యమైందని మాకు సమాచారం అందింది. సదరు విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి పార్కుకు వచ్చింది. ఆమె తలపై గాయాలు ఉన్నాయి. డెడ్ బాడీ సమీపంలో ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నాం. నిందితుడి కోసం గాలిస్తున్నాం’ అని దక్షిణ ఢిల్లీ (South Delhi) డీసీపీ చందన్ చౌదరి (DCP Chandan Choudhary) తెలిపారు.
Delhi | We received information that the body of a 25-year-old girl was found near Aurbindo College in South Delhi's Malviya Nagar. An iron rod was found near her body. According to a preliminary investigation, the girl was attacked with a rod. Further investigation is in… pic.twitter.com/eCOeVAd1yi
— ANI (@ANI) July 28, 2023
Also Read..
Disney+ Hotstar | నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ + హాట్ స్టార్.. ఖాతా షేరింగ్ లో పరిమితులు
Drugs Smuggling | డ్రోన్ల ద్వారా భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్.. అంగీకరించిన పాక్ ప్రధాని సలహాదారు
IndiGo | విమానంలో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్