IndiGo | ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో (Delhi-Mumbai Flight) ఓ మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై 47 ఏళ్ల ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్ట్ (Professor Arrested) చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిన ఇండిగో (IndiGo) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానంలో ప్రొఫెసర్, వైద్యురాలు పక్కపక్క సీట్లోనే కూర్చున్నారు. విమానం ముంబైలో ల్యాండ్ అవడానికి కొద్ది సేపటి ముందు నిందితుడు మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు (Sexually Harassing). దీంతో ఆ వైద్యురాలు విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో వారు జోక్యం చేసుకున్నారు. అనంతరం విమానం ల్యాండ్ అవ్వగానే ఘటనపై సదరు వైద్యురాలు సహార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం నిందితుడికి బెయిల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Prabhas | ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. ఇన్ స్టా ద్వారా వెల్లడించిన డార్లింగ్
Syria Blast | ప్రార్థనా మందిరం సమీపంలో పేలుడు.. ఆరుగురు మృతి
Woman Kills Husband | భర్తను గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య