Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ (Facebook Account Hacked) కు గురైంది. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో ఓ వైరల్ వీడియో దర్శనమిచ్చింది. ఆ వీడియోకి ‘మనుషులు దురదృష్టవంతులు’ (Unlucky Humans) అని క్యాప్షన్ ఉండటంతో.. అభిమానులు షాక్ అయ్యారు. వెంటనే డార్లింగ్ ఎఫ్ బీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్స్ పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ టీం సమస్యను పరిష్కరించింది. కొద్దిసేపటికే ఖాతాను పునరుద్ధరించింది.
అందులో షేర్ చేసిన వీడియోను తొలగించింది. మరోవైపు తన అకౌంట్ హ్యాక్ అయినట్లు ప్రభాస్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు. తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. అతి త్వరలో దాన్ని రిస్టోర్ చేసేందుకు టీం ప్రయత్నిస్తోందని తెలిపారు.
ప్రభాస్ 2013 అక్టోబర్ 18న ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టారు. డార్లింగ్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, ప్రభాస్ మాత్రం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిని మాత్రమే అనుసరిస్తున్నారు. ప్రభాస్ సామాజిక మాధ్యమాలను తన సినిమా అప్ డేట్స్, నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు.
Also Read..
Syria Blast | ప్రార్థనా మందిరం సమీపంలో పేలుడు.. ఆరుగురు మృతి
Woman Kills Husband | భర్తను గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య
Couple | కసాయి తల్లిదండ్రులు.. జల్సాల కోసం కన్నబిడ్డను అమ్ముకున్నారు