Syria Blast | సిరియాలో పేలుడు (Syria Blast) సంభవించింది. రాజధాని డమాస్కస్ (Damascus) సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
సిరియాలో అత్యధికంగా సందర్శించే షియా పుణ్యక్షేత్రమైన సయేదా జైనాబ్ సమాధి (Sayeda Zeinab mausoleum) సమీపంలో ఈ పేలుడు సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్యాక్సీలో బాంబు పెట్టడం వల్ల ఈ పేలుడు సంభవించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఉగ్రవాదుల పనే అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Woman Kills Husband | భర్తను గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య
Couple | కసాయి తల్లిదండ్రులు.. జల్సాల కోసం కన్నబిడ్డను అమ్ముకున్నారు
RTC Bus | పైకప్పు ఊడినా రోడ్డుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో