RTC Bus | పైకప్పు ఊడినా రోడ్డుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
RTC Bus | మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (MSRTC)కు చెందిన బస్సు పైకప్పు (Rooftop) లేచినా ఆగకుండా రహదారిపై పరుగులు పెట్టింది.
RTC Bus | మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (MSRTC)కు చెందిన బస్సు పైకప్పు (Rooftop) లేచినా ఆగకుండా రహదారిపై పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గడ్చిరోలి (Gadchiroli) జిల్లా అహెరి (Aheri) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) నిత్యం గడ్చిరోలి – అహెరి మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అయితే రోజూ మాదిరిగానే గురువారం ఉదయం 6.30 గంటలకు అహెరిలో బయలు దేరిన బస్సు 10.30 గంటలకు గడ్చిరోలికి చేరుకుంది. తిరిగి 11 గంటలకు గడ్చిరోలి నుంచి అహెరికి రిటర్న్ అయ్యింది. ఈ క్రమంలో బస్సు మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి మాల్ చర్ల – అల్లపల్లి ప్రాంతంలోకి రాగానే దాని పై కప్పు సగం వరకూ పైకి లేచింది. అయినా డ్రైవర్ బస్సును అలాగే వేగంగా పోనిచ్చాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
ఘటనపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ చన్నెను స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Shocking! Maharashtra State Road Transport Corp. (MSRTC) bus runs with a broken roof!#MumbaiRains #BaarishAaGayiHai #BarishAaGayiHai #WorldCup2023 pic.twitter.com/x96BpuxAFF
— Voice of Mumbai (@GreaterMumbai) July 26, 2023
Also Read..
Viral Video | వెరైటీ ఫుడ్ కాంబో : ఓరియో, వెజిటబుల్స్‌తో ఫ్రైడ్ రైస్
SRSP | శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద.. 32 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

