SRSP | శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద.. 32 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
నిజామాబాద్: ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికోసం ఎస్కేప్ గేట్ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చు. అయితే ఇప్పుడు 78.661 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ (Nizamsagar) ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1404.58 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 17.195 టీఎంసీలు. ఇప్పుడు ప్రాజెక్టులో 17.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో జిల్లాలోని బీర్కూర్‌లో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఐదు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

