న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు (Viral Video) సందడి చేస్తుంటాయి. అన్ని ఫుడ్ కాంబోలు నెటిజన్లను ఆకట్టుకోలేవు. చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్లపై నెటిజన్లు పెదవివిరుస్తుంటారు. ఇక లేటెస్ట్గా ఓరియో ఫ్రైడ్ రైస్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్వీట్, సేవరీ టేస్ట్ యమ్మీ అని కొందరు ఇష్టపడినా ఇదేం కాంబినేషన్ అంటూ పలువురు నొసలు చిట్లించారు.
ఇన్స్టాగ్రాం మీమ్ పేజ్ తొలుత ఈ వీడియోను షేర్ చేయగా ఈ యూనిక్ డిష్ ప్రిపరేషన్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముందుగా ఓ వ్యక్తి పాన్‌లో నూనెను వేడి చేస్తూ అందులో పలు ఓరియో బిస్కెట్లను వేయడంతో ఆరంభమవుతుంది. బిస్కెట్లు మెత్తగా అయ్యేందుకు కుక్ హాట్ ఆయిల్లో చాక్లెట్ పేస్ట్‌ను మిక్స్ చేయడం కనిపిస్తుంది.
ఈ మిక్స్చర్ను కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ప్లెయిన్ రైస్‌ను యాడ్ చేస్తాడు. ఆపై రైస్ కుక్ అయిన తర్వాత కుక్ అందులో కొన్ని కూరగాయలు, సాల్ట్‌ను వేస్తాడు. సోయా సాస్‌తో ఫైనల్ టచ్ ఇవ్వడంతో వెరైటీ డిష్ పూర్తవుతుంది. ఆపై దీన్ని గ్రీన్ ఆనియన్స్, క్యారట్‌తో గార్నిష్ చేస్తాడు.
Read More :