Manipur Violence | రాజస్ధాన్‌లో ర్యాలీకి హాజరవుతారు కానీ..మణిపూర్‌పై ప్రకటన చేసేందుకు తీరిక లేదా..? : మోదీపై ఖర్గే ఫైర్
పార్లమెంట్లో మణిపూర్ (Manipur Violence) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రెండు నెలలుగా భగ్గుమంటున్న మణిపూర్ వ్యవహారంపై తక్షణమే చర్చ చేపట్టాలని గురువారం ఉభయసభల్లో విపక్షాలు పట్టుపట్టాయి.
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మణిపూర్ (Manipur Violence) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రెండు నెలలుగా భగ్గుమంటున్న మణిపూర్ వ్యవహారంపై తక్షణమే చర్చ చేపట్టాలని గురువారం ఉభయసభల్లో విపక్షాలు పట్టుపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరై మణిపూర్‌పై ప్రకటన చేయాలని తాము కోరుతుంటే సభ నడుస్తుండగా ఆయన రాజస్ధాన్‌లో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
రాజస్ధాన్‌లో ర్యాలీలకు హాజరైన ప్రధానికి అరగంట సమయం సభకు హాజరై ప్రకటన చేసేందుకు సమయం లభించడం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ఆసక్తి లేదని, ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని వెల్లడవుతోందని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరుకోవడం లేదని చెప్పారు. పార్లమెంట్‌ను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
ఇక అంతకుముందు ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో కొందరు ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభకు చెందిన విపక్ష ఎంపీలు ఆ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు వచ్చి మణిపూర్‌పై ప్రకటన చేయాలని ఆ ఎంపీలు నినాదాలు చేశారు. నల్ల దుస్తులు ధరించిన విపక్ష ఎంపీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు చేశారు. ఆ దుస్తులు ధరించిన వాళ్ల ప్రస్తుత పరిస్థితి, గతం, భవిష్యత్తు కూడా నలుపే అని ఆయన రాజ్యసభలో ఆరోపించారు. కానీ వాళ్ల జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read More :
Niger Military Coup | ఆఫ్రికా దేశంలో మిలటరీ తిరుగుబాటు.. దేశాధ్యక్షుడినే బంధించిన సైన్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

