Niger Military Coup | ఆఫ్రికా దేశంలో మిలటరీ తిరుగుబాటు.. దేశాధ్యక్షుడినే బంధించిన సైన్యం
Niger Military Coup | నైజర్‌లో సైన్యం తిరుగుబాటును ప్రకటించింది. దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపడుతున్నట్లు జాతీయ ఛానల్లో సైన్యం వెల్లడించింది. దేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జాతీయ సంస్థలను, సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు సైనికులు తెలిపారు.
Niger Military Coup | నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్(NIger)లో సైన్యం తిరుగుబాటు(Coup)ను ప్రకటించింది. దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపడుతున్నట్లు జాతీయ ఛానల్లో సైన్యం వెల్లడించింది. దేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జాతీయ సంస్థలను, సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు సైనికులు తెలిపారు. దేశాధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తమ ఆధీనంలో ఉన్నట్లు సైనికులు వెల్లడించారు.
ప్రెసిడెన్షియల్ గార్డ్స్‌కు చెందిన దళాలు అధ్యక్ష భవనాన్ని సీజ్ చేశారు. రాజధాని నియామేలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు బజౌమ్తో జరిగిన చర్చలు విఫలం అయ్యాయని, అందుకే ఆయన్ను రిలీజ్ చేయడం లేదని సైనికులు తెలిపారు. అధ్యక్షుడు బజౌమ్ అరెస్టును అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి.
పశ్చిమ ఆఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో బజౌమ్ కీలక పాత్ర పోషించారు. పశ్చిమ దేశాలకు ఆయన మంచి సపోర్టు ఇచ్చారు. ఇటీవల నైజర్ పొరగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలో కూడా సైనిక తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

