Drugs Smuggling | డ్రోన్ల ద్వారా భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్.. అంగీకరించిన పాక్ ప్రధాని సలహాదారు
Drugs Smuggling | నిషేధిత డ్రగ్స్ (Drugs)ను సరిహద్దుల గుండా భారత్ (India)కు తరలించేందుకు డ్రోన్ల (Drones)ను ఉపయోగిస్తున్నట్లు పాకిస్థాన్ (Pakistan) అంగీకరించింది.
Drugs Smuggling | నిషేధిత డ్రగ్స్ (Drugs)ను సరిహద్దుల గుండా భారత్ (India)కు తరలించేందుకు డ్రోన్ల (Drones)ను ఉపయోగిస్తున్నట్లు పాకిస్థాన్ (Pakistan) అంగీకరించింది. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ (Hamid Mir)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రక్షణ సలహాదారు మాలిక్ మహమ్మద్ ఖాన్ (Malik Muhammad Ahmad Khan) కెమెరా ముందు ఈ గుట్టును బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు జర్నలిస్ట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో సరిహద్దుల గుండా ఎక్కువగా హెరాయిన్ ను అక్రమంగా స్మగ్లింగ్ చేయడానికి డ్రోన్ లను ఉపయోగిస్తున్నట్లు మాలిక్ ఖాన్ అంగీకరించారు.
ఇంటర్వ్యూలో భాగంగా భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి మాలిక్ ను ప్రశ్నించగా.. ‘ఎల్ఓసీ సమీపంలోని కసూర్ రేంజర్స్ ప్రాంతం. సరిహద్దు నిబంధనల కారణంగా ఈ ప్రాంతం చాలా సున్నితమైంది. దురదృష్టవశాత్తు అక్కడ డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్ జరుగుతోంది. ఇటీవలే రెండు డ్రోన్లకు ఒక్కో దానికి 10 కిలోల హెరాయిన్ ను కట్టి విసిరేసిన రెండు ఘటనలు జరిగాయి. ఏజెన్సీలు దానిపై దర్యాప్తు చేస్తున్నాయి’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
IndiGo | విమానంలో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
Prabhas | ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. ఇన్ స్టా ద్వారా వెల్లడించిన డార్లింగ్
Woman Kills Husband | భర్తను గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

