Disney + Hotstar | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఇటీవలే పాస్వర్డ్ షేరింగ్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ (OTT Platform) డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar) సైతం నెట్ఫ్లిక్స్ బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రీమియం యూజర్లకు పాస్వర్డ్ షేరింగ్ (Password Sharing)ను కేవలం నాలుగు డివైజ్ లకు మాత్రమే అనుమతించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను ముందుగా భారత్ సహా మరికొన్ని దేశాల్లో అమల్లోకి తేవాలని సంస్థ భావిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజా నిర్ణయంతో యూజర్ల సంఖ్య పెరుగుతుందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం డిస్నీ + హాట్ స్టార్ ప్రీమియం వినియోగదారులకు నాలుగు డివైజుల్లో లాగిన్ కు అనుమతి ఉన్నప్పటికీ.. తమ పాస్ వర్డ్ తో 10 డివైజుల్లో లాగిన్ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఒకేసారి నాలుగు డివైజుల్లో మాత్రమే కంటెంట్ చూసేందుకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో లాగిన్ ను నాలుగు డివైజులకు మాత్రమే పరిమితం చేయాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, పాస్వర్డ్ షేరింగ్ ను నెట్ఫ్లిక్స్ ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇకపై కుటుంబ సభ్యులకు మాత్రమే పాస్వర్డ్ షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్ ( single household) కాకుండా ఇతరులతో పాస్వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వారం క్రితమే ఈ నిబంధనలను భారత్ లో కూడా అమల్లోకి తెచ్చింది. మొత్తం 100 కుపైగా దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్ కు నెట్ఫ్లిక్స్ అనుమతించలేదు.
Also Read..
Drugs Smuggling | డ్రోన్ల ద్వారా భారత్ కు డ్రగ్స్ స్మగ్లింగ్.. అంగీకరించిన పాక్ ప్రధాని సలహాదారు
IndiGo | విమానంలో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
Prabhas | ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. ఇన్ స్టా ద్వారా వెల్లడించిన డార్లింగ్