Girl Molest | రంగారెడ్డి : తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ గిరిజన బాలికపై భూ యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
శంషాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక, తండ్రితో పాటు సమీప గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్లేది. అయితే ఆమెపై కన్నేసిన భూ యజమాని(30) బాలికను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి బాధితురాలు కూడా నోరువిప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. దాదాపు అయిదు నెలలు గడిచాక విషయం బయటకు పొక్కడంతో బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యురాలికి డబ్బులు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు.
ఎలాగూ తప్పు జరిగిందని.. ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పాడు. స్థానికంగా కొందరి జేబులు నింపి అనుకూలంగా మలచుకున్నాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు డబ్బులకు లొంగలేదు. శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Mark Zuckerberg | భార్య ప్రిస్సిల్లాకు అపూర్వ కానుక ఇచ్చిన మెటా సీఈవో జుకర్బర్గ్.. ఫొటోలు వైరల్