శనివారం 28 నవంబర్ 2020
Crime - Oct 24, 2020 , 11:35:34

సిరిసిల్లలో బట్టల దుకాణ యజమాని ఆత్మహత్య

సిరిసిల్లలో బట్టల దుకాణ యజమాని ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో ఓ బట్టల దుకాణం యజమాని ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని అనంతనగర్‌కు చెందిన గాజుల జనార్ధన్(32) ఇంట్లో నుంచి వెళ్లి సిరిసిల్లలోని బైపాస్ రోడ్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శనివారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతోనే అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జనార్ధన్‌కి భార్య ఉండగా సంతానం కలగలేదు. సీఐ వెంకటనరసయ్య కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.