Uttar Pradesh | రాత్రి ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు
Uttar Pradesh | రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం (Family)లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది.
Uttar Pradesh | రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించిన ఓ కుటుంబం (Family)లోని ఐదుగురు చిన్నారులు తెల్లారేసరికి విగతజీవులుగా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అమ్రోహా (Amroha) జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు సోమవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. అయితే, సోమవారం రాత్రి మూసుకున్న తలుపులు మంగళవారం సాయంత్రం అయినా తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అందులో ఐదుగురు చిన్నారులు విగతజీవులై కనిపించారు. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ఇద్దర్నీ వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని రహీజుద్దీన్గా గుర్తించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుపమ్ సింగ్ తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా, మిగతా ఇద్దరు బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతడి తమ్ముడు చావుబతుకుల్లో ఉన్నట్లు వివరించారు.
చలికావడంతో ఇంట్లో వెచ్చగా ఉండేందుకు పెట్టుకున్న బొగ్గుల కుంపటి వల్లే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Alaska Airlines | తప్పు మాదే.. మళ్లీ ఇలా జరగదు : డోర్ ఊడిన ఘటనపై అలాస్కా ఎయిర్లైన్స్
Mohammed Shami | ‘అర్జున’ అందుకోవడం గర్వంగా ఉంది : షమీ
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

