Alaska Airlines | తప్పు మాదే.. మళ్లీ ఇలా జరగదు : డోర్ ఊడిన ఘటనపై అలాస్కా ఎయిర్‌లైన్స్
Alaska Airlines | ఈ నెల 5 అలాస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines)కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానం గాల్లో ఉండగా తలుపులు తెరుచుకున్నాయి (plane door blowout). ఈ ఘటనపై విమానయాన సంస్థ తాజాగా స్పందించింది. ఈ ఘటనలో తప్పు తమదేనని అంగీకరించింది.
Alaska Airlines | ఈ నెల 5 అలాస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines)కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానం గాల్లో ఉండగా తలుపులు తెరుచుకున్నాయి (plane door blowout). విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై విమానయాన సంస్థ తాజాగా స్పందించింది. ఈ ఘటనలో తప్పు తమదేనని అంగీకరించింది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటామని తెలిపింది.
ఈ మేరకు సీఈవో (Boeing CEO) డేవ్ చల్హౌన్ (Dave Calhoun) ఉద్యోగులతో మీటింగ్ నిర్వహించారు. తప్పును అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. పూర్తిస్థాయి పారదర్శకత కోసం నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, గత శనివారం పోర్ట్‌ల్యాండ్ నుంచి ఒంటారియోకు వెళ్లాల్సిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం (737 MAX 9 plane) టేకాఫ్ అయిన కొంతసేపటికి 16,325 అడుగుల ఎత్తులో దాని మధ్య క్యాబిన్ నిష్క్రమణ ద్వారం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ విమానయాన సంస్థలకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను తనిఖీ చేయాలలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా విమానాల తనిఖీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపింది.
Also Read..
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
Tattoos of Ram | భక్తుల ఒంటిపై శ్రీరాముడి పచ్చబొట్లు.. ఉచితంగా వేస్తున్న టాటూ ఆర్టిస్ట్
Mohammed Shami | ‘అర్జున’ అందుకోవడం గర్వంగా ఉంది : షమీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

