Mohammed Shami | ‘అర్జున’ అందుకోవడం గర్వంగా ఉంది : షమీ
Mohammed Shami | టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు (Arjuna Award)ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవార్డు దక్కడం పట్ల షమీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Mohammed Shami | టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు (Arjuna Award)ను అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము (Draupadi Murmu) చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు దక్కడం పట్ల షమీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోవడం గర్వంగా అనిపిస్తోంది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సమయంలో నాకు చాలా మంది మద్దతుగా నిలిచారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నా కుటుంబం, అభిమానులు, కోచ్, బీసీసీఐ, జట్టు సభ్యులకు, సిబ్బంది ఎంతో సహకారం అందించారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా కష్టాన్ని గుర్తించి అవార్డును ప్రకటించినందుకు ధన్యవాదాలు. నా దేశం గర్వపడేలా నా వంతు కృషి చేస్తాను. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తా. అవార్డులు అందుకున్న తోటి క్రీడాకారులకు అభినందనలు’ అని షమీ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Today I am feeling very proud that I have been honored with the prestigious Arjuna Award by the President. I want to thank all those people who have helped me a lot to reach here and have always supported me in my ups and downs… thanks to My Coach, BCCI,team mates,my family,… pic.twitter.com/fWLGKfY5g8
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024
సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో అద్భుతంగా రాణించినందుకు షమీ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. మోగా టోర్నీలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. తన సూపర్ బౌలింగ్‌తో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. అయితే.. టైటిల్ పోరులో షమీ రెండు వికెట్లతో విజృంభించినా ట్రావిస్ హెడ్(137) సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
కాగా, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు గుర్తింపు దక్కింది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన ప్లేయర్లను కేంద్ర క్రీడాశాఖ సముచిత రీతిలో గౌరవించింది. మంగళవారం రాష్ట్రపతి భవన్ వేదికగా కన్నుల పండువగా జరిగిన వార్షిక క్రీడా అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ప్లేయర్లకు అవార్డులు ప్రదానం చేశారు.
Also Read..
Tattoos of Ram | భక్తుల ఒంటిపై శ్రీరాముడి పచ్చబొట్లు.. ఉచితంగా వేస్తున్న టాటూ ఆర్టిస్ట్
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
Charminar Express | పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

