Charminar Express | పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. పలువురికి గాయాలు
Charminar Express | నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లోకి చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. రైలులోని మూడు బోగీలు పట్టాలు దాటి పక్కకు వెళ్లాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లో ఆగే క్రమంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని రైల్వే అధికారులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. స్టేషన్లో దిగడానికి కొన్ని సెకన్ల ముందు రైలు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు స్టేషన్లో ఆగే క్రమంలో నెమ్మదిగా ఉంది కాబట్టి సరిపోయిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని చర్చించుకుంటున్నారు.
కాగా ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైలు ఆగుతున్న సమయంలో పట్టాలు దిగినందున పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. అప్పటికే చాలామంది ప్రయాణికులు దిగిపోయారని, కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. రైలులోని ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది.
Charminar Express from #Chennai to Hyderabad derailed at #Nampally railway station.
Minor injuries reported among some passengers.#Hyderabad #Derailment #Charminarexpress pic.twitter.com/ggnItYXTU2
— Sudhakar Udumula (@sudhakarudumula) January 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

