KTR : అచ్చంపేటలో బుధవారం బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనపై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మీరు చెప్పే ‘ప్రేమను పెంచడం’ అంటే ఇదేనా రాహుల్ జీ’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో కేటీఆర్ ఒక పోస్ట్ పెట్టారు.
ఆ పోస్టుకు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోస్టు చేసిన వీడియోను కేటీఆర్ జతచేశారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.
దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామంటూ తెలంగాణ డీజీపీ (@TelanganaDGP) ని టాగ్ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.
Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?
Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31
— KTR (@KTRBRS) May 15, 2024