అమరావతి : తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopard roamed) కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో(Ghat Road) చిరుత సంచరించింది. బుధవారం తెల్లవారుజామున భక్తుల(Devotees) కారుకు చిరుత అడ్డు వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, భక్తులను అప్రమత్తం చేశారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని తెలిపారు. కాగా, గతంలో కూడా ఇదే ప్రదేశంలో చిరుత పులులు పలుమార్లు కనిపించడం గమనార్హం.