Murder attempt | ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం..
Murder attempt | నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ మరో వ్యక్తితో మాట్లాడుతూ నిలబడి ఉండగా.. దుండగులు ఆయనను కారుతో ఢీకొట్టారు.
Murder attempt : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ మరో వ్యక్తితో మాట్లాడుతూ నిలబడి ఉండగా.. దుండగులు ఆయనను కారుతో ఢీకొట్టారు.
దాంతో ఎగిరి కిందపడ్డ నిఖిల్ లేచి పరుగెడుతుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో వెంటపడి దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లడంతో దుండగులు పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.
గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతోపాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

