సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 12:57:27

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య?

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ విషాదకర ఘటన దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలోని జమాల్పూర్‌ గ్రామంలో జరిగింది. అయితే వారిది ఆత్మహత్యా? ఎవరైనా హత్య చేశారా? తెలియడం లేదు. ఘటనకు సంబంధించిన కారణాలు కూడా తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వారిది హత్యగా అనుమానిస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపినట్లు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo