Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శ్రీఖండి నుంచి ఇండోర్ (Indore) వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖర్గోన్ (Khargone) జిల్లాలో వంతెన (Bridge) పై నుంచి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెయిలింగ్‌ను ఢీ కొట్టిన అనంతరం బస్సు 50 అడుగుల కిందున్న నదిలోకి పడిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా, బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం (compensation ) ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పగాయాలతో బయటపడ్డ వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
Also Read..
LinkedIn LayOffs | కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు.. లింక్డ్ఇన్నూ తాకిన లేఆఫ్స్ సెగ
Congo floods | కాంగోలో వరద బీభత్సం.. 400 మందికిపైగా మృతి
AI Pics | ధోనీ టు కోహ్లీ.. మన క్రికెటర్లు అమ్మాయిలైతే ఇలా ఉంటారు..!