LinkedIn LayOffs | ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతోంది. ఈ లేఆఫ్సెగ మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ (LinkedIn) కూ తగిలింది. తాజాగా కంపెనీలో పనిచేసే కొంతమంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. సుమారు 716 మందికి లేఆఫ్ (LayOff) ప్రకటించినట్లు జాబ్ సెర్చ్ దిగ్గజం లింక్డ్ఇన్ వెల్లడించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం. అదే సమయంలో చైనా-ఫోకస్డ్ జాబ్ అప్లికేషన్‌ను కూడా మూసివేసేందుకు సిద్ధమైంది.
లింక్డ్ఇన్లో దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత సంవత్సరం త్రైమాసికంలో కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ.. ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించడం గమనార్హం. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించడమే లక్ష్యంగా అమ్మకాలు, కార్యకలాపాలు, సహాయబృందాల్లో స్టాఫ్‌ను తగ్గించాలని భావిస్తున్నట్లు లింక్ట్‌ఇన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ (Ryan Roslansky) ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read..
Congo floods | కాంగోలో వరద బీభత్సం.. 400 మందికిపైగా మృతి
AI Pics | ధోనీ టు కోహ్లీ.. మన క్రికెటర్లు అమ్మాయిలైతే ఇలా ఉంటారు..!
Asia Cup | పాకిస్థాన్‌కు భారీ షాక్.. చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం