Congo floods | కాంగోలో వరద బీభత్సం.. 400 మందికిపైగా మృతి
Congo floods | ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు ఆ దేశం అల్లాడుతోంది. ఈ విపత్తులో ఆ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Congo floods | ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు ఆ దేశం అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి.. దక్షిణ కివు ప్రావిన్స్ (South Kivu province) ను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు చోట్ల ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. వరదలకు తోడు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఈ విపత్తులో ఆ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ (South Kivu province) తియో గ్వాబిజే కాసీ (Theo Ngwabidje Kasi) వెల్లడించారు. వందలమంది గల్లంతయ్యారని తెలిపారు. కివు లోయలో బురదలో మృతదేహాలు కూరుకుపోయినట్లు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Congo Flood 2
భారీగా ముంచెత్తిన వరదల కారణంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు నిలువనీడ లేక ఆరుబయటే నిద్రిస్తున్నారు. కాలేహీ టెరిటరీ పరిధిలోని దక్షిణ కివు ప్రాంత బుషుషు,న్యాముకుబి గ్రామాలు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో సుమారు 1200 ఇళ్లు పూర్తిగా శిథిలమైనట్లు అధికారులు వెల్లడించారు. 2014లో ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించినట్లు తెలిపారు.
Also Read..
AI Pics | ధోనీ టు కోహ్లీ.. మన క్రికెటర్లు అమ్మాయిలైతే ఇలా ఉంటారు..!
Asia Cup | పాకిస్థాన్‌కు భారీ షాక్.. చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం
Madhya Pradesh | నదిలో పడిపోయిన బస్సు.. 15 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

