Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జి (bridge)పై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
శ్రీఖండి నుంచి ఇండోర్ (Indore) వెళ్తున్న బస్సు ఖార్గోన్ (Khargone) జిల్లాలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. నదిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
India Corona | 24 గంటల్లో 1,331 కొత్త కేసులు.. 11 మరణాలు
Tamil Nadu | ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. మంత్రివర్గం నుంచి ఆర్థిక మంత్రికి ఉద్వాసన..!