India Corona | 24 గంటల్లో 1,331 కొత్త కేసులు.. 11 మరణాలు
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండో రోజూ కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది.
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండో రోజూ కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య (Union Health Ministry) శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,44,767 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,331 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,72,800కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 22,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,18,351 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,707కి చేరింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,79,735 ) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Pepper Spray: ఫోన్ లాక్కున్న టీచర్‌పై పెప్పర్ స్ప్రే చేసిన విద్యార్థిని.. వీడియో
Tamil Nadu | ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. మంత్రివర్గం నుంచి ఆర్థిక మంత్రికి ఉద్వాసన..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

