టెన్నిస్సి: అమెరికాలో ఓ హై స్కూల్ విద్యార్ధిని.. టీచర్‌పై పెప్పర్ స్ప్రే(Pepper Spray)తో అటాక్ చేసింది. ఈ ఘటన టెన్నిస్సిలోని నాష్‌విల్లేలో ఉన్న ఆంటియాక్ హై స్కూల్లో జరిగింది. పెప్పర్ స్ప్రేకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. క్లాసురూంలో ఫోన్ వాడుతున్నందుకు.. విద్యార్ధిని నుంచి ఆ ఫోన్‌ను టీచర్ లాగేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థిని.. టీచర్‌పై పెప్పర్ స్ప్రే చేసింది.
Girl pepper sprays teacher because he took her phone pic.twitter.com/QPAz6c3l4G
— OnlyBangers.eth (@OnlyBangersEth) May 6, 2023
ఓ దశలో టీచర్ కిందపడి అరిచాడు. అయినా ఆ విద్యార్థిని మాత్రం తనకు ఫోన్ ఇవ్వాలంటూ టీచర్‌ను వెంటాడింది. స్కూల్ వర్క్‌ను గూగుల్‌లో సెర్చ్ చేసి.. ఫోన్ ద్వారా టెక్ట్స్ చేస్తూ సమాధానం ఇస్తున్నట్లు టీచర్ ఆరోపించాడు.