మీల్మేకర్ (సోయా చంక్స్): ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: అర టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, లైట్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి: అర టీస్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్.
మీల్‌మేకర్‌ను వేడి నీళ్లలో ఐదు నిమిషాలు మరిగించాక.. నీళ్లు వడకట్టాలి. మళ్లీ చల్లటి నీళ్లుపోసి గట్టిగా పిండి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మీల్మేకర్, ఉప్పు, కార్న్‌ఫ్లోర్ బాగా కలుపుకోవాలి. మీల్మేకర్లను విడివిడిగా నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత, ఒక టేబుల్ స్పూన్ నూనెలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించాక.. మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, సోయాసాస్, టమాట కెచప్, చిల్లీ పేస్ట్, అజినమోటో, తెల్లమిరియాల పొడి, వెనిగర్ వేసి అర కప్పు నీళ్లుపోసి బాగా ఉడికించాలి. బాగా ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించిన మీల్మేకర్లను వేసి బాగా కలిపి.. పైనుంచి ఉల్లికాడల తురుము వేసుకుంటే వేడివేడి సోయా మంచూరియా సిద్ధం.
Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ ఎలా వండాలి?