క్యాబేజీ తరుగు: మూడు కప్పులు, బియ్యపు పిండి: అర కప్పు, మైదా పిండి: అర కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్ చొప్పున, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, టమాట కెచప్: రెండు టేబుల్ స్పూన్లు, అజినమోటో: ఒక టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ఫుడ్‌కలర్ (రెడ్): చిటికెడు, కరివేపాకు: నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి: నాలుగు, పల్లీలు/జీడిపప్పు: పావు కప్పు,
ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో క్యాబేజీ తరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినమోటో వేసి బాగా కలిపి.. సోయాసాస్, రెడ్, గ్రీన్ చిల్లీ సాస్, టమాట కెచప్ వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమంలో బియ్యపు పిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టిగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి.. వేడయ్యాక క్యాబేజీ మిశ్రమాన్ని విడివిడిగా వేసి దోరగా వేయించాలి. అదే కడాయిలో చీల్చిన పచ్చిమిర్చి, పల్లీలు/జీడిపప్పు, కరివేపాకు కూడా వేసి, వేయించి పైనుంచి వేసుకుంటే కరకరలాడే క్యాబేజీ 65 సిద్ధం.
Potli Samosa Recipe | పొట్లి సమోసా తయారీ విధానం