Pineapple Fried Rice Recipe | థాయి స్టైల్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి చూడండి
Pineapple Fried Rice Recipe: పైనాపిల్ ఫ్రైడ్ రైస్
ఏం కావాలి?
పైనాపిల్ ముక్కలు: అర కప్పు, బియ్యం: ఒక కప్పు, తరిగిన క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, తరిగిన అల్లం, వెల్లుల్లి: ఒక టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, నూనె: మూడు టేబుల్ స్పూన్లు, సోయా సాస్: ఒక టీస్పూన్, చిల్లీ సాస్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
ఎలా వండాలి?
బియ్యాన్ని బాగా కడిగి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేగాక క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక పైనాపిల్ ముక్కలు వేసి మరికాసేపు వేయించి సోయా, చిల్లీ సాస్, ఉప్పు, అన్నం జోడించి రెండు నిమిషాలపాటు సన్నటి మంటపై బాగా కలిపితే ఘుమఘుమలాడే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ.

చిట్కా
ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరగడంతోపాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధి జరిగి రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది.ఎండాకాలంలో బెల్లం వేసిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. నీరసంగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్కను దవడన పెట్టుకుంటే సత్వర శక్తి లభిస్తుంది. బెల్లంలోని పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

