రాగిపిండి: రెండు కప్పులు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: కొద్దిగా.
ఒక గిన్నెలో రాగిపిండి, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలిపి రెండు కప్పుల గోరువెచ్చని నీళ్లుపోసి జారుగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి పిండిమిశ్రమం పోసి దగ్గరపడే వరకూ సన్నని మంటపై కలుపుతూ ఉడికించాలి. దగ్గరపడ్డాక చల్లార్చి పిండిని ముద్దలా కలపాలి. మురుకుల గొట్టానికి నూనెరాసి, పిండి ముద్దను పెట్టి నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఒత్తుకోవాలి. ఇడ్లీ కుక్కర్‌లోగానీ, గిన్నెలోగానీ నీళ్లుపోసి ఆవిరిపై ఉడికించుకుంటే రాగి ఇడియప్పం సిద్ధం. దీన్ని చట్నీ లేదా సాంబారుతో కారంగానూ; పచ్చికొబ్బరి, పాలు, చక్కెర కలుపుకొని తియ్యగానూ ఆరగించవచ్చు.
Potli Samosa Recipe | పొట్లి సమోసా తయారీ విధానం
Avakaya Pulihora Recipe | ఆవకాయ పులిహోర తయారీ విధానం
Lauki Burfi Recipe | సొరకాయ బర్ఫీ తయారీ విధానం
Pineapple Fried Rice Recipe | థాయి స్టైల్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి చూడండి