అన్నం: రెండు కప్పులు, ఆవకాయ: అర కప్పు, నూనె: పావు కప్పు, నెయ్యి: ఒక టేబుల్‌స్పూన్, పల్లీలు: పావు కప్పు, మినుపపప్పు: ఒక టేబుల్‌స్పూన్, శనగపప్పు: ఒక టేబుల్‌స్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఇంగువ: పావు టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, టమాట: ఒకటి, ఎండుమిర్చి: రెండు, పచ్చిమిర్చి: మూడు, ఆవాలు: ఒక టీస్పూన్.
స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, పల్లీలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, మినుపపప్పు, శనగపప్పు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక ఇంగువ, పసుపు, తరిగిన టమాట ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి సన్నటి మంటపై రెండు నిమిషాలు మగ్గించాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఆవకాయ, అన్నం వేసి బాగా కలిపి దింపేయాలి. చివరగా కొత్తిమీర తురుము, నెయ్యి వేసి బాగా కలిపితే కమ్మకమ్మగా నోరూరించే ఆవకాయ పులిహోర సిద్ధం.
“Malai Kofta Recipe | మలై కోఫ్తా తయారీ విధానం”