Coconut Milk Chicken Recipe | కొబ్బరిపాల చికెన్ తయారీ విధానం
Coconut Milk Chicken Recipe | కొబ్బరిపాల చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
కొబ్బరిపాలు: మూడు కప్పులు, చికెన్: అరకిలో, ఉల్లిగడ్డ: ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, పసుపు: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: పావు కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, యాలకులు: నాలుగు, లవంగాలు: ఎనిమిది, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, అనాస పువ్వు: చిన్నముక్క, బిర్యానీ ఆకు: ఒకటి, మిరియాలు: అర టీస్పూన్, ఆవాలు: అర టీస్పూన్, సోంపు: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఎండుమిర్చి: రెండు.
Coconut Milk Chicken Recipe | కొబ్బరిపాల చికెన్ తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్, కారం, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఒక టేబుల్ స్పూన్ నూనె కలిపి ఓ కప్పు కొబ్బరిపాలు పోయాలి. తర్వాత, మరోసారి కలగలిపి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. మిరియాలు, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, సోంపు, దంచిన మసాలా, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి.. బాగా వేగాక నానబెట్టిన చికెన్ కలిపి మూతపెట్టి, సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. నూనె పైకి తేలేవరకు ఉడికిన తర్వాత.. మిగతా రెండు కప్పుల కొబ్బరిపాలు పోసి దగ్గరపడేవరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే నోరూరించే కొబ్బరిపాల చికెన్ సిద్ధం.
Read More Recipes :
Apollo Chicken Recipe | అపోలో చికెన్ తయారీ విధానం”
“Chicken Keema Sandwich Recipe | చికెన్ కీమా సాండ్విచ్ తయారీ విధానం”
“lemon chicken lollipops Recipe | లెమన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం”
చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

