మైదాపిండి: రెండు కప్పులు, ఆలుగడ్డ: రెండు, క్యారెట్: ఒకటి, క్యాలీఫ్లవర్ తరుగు: అరకప్పు, పచ్చిబఠాణీ: పావు కప్పు, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు: రెండు రెబ్బలు, జీలకర్ర: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కనపెట్టాలి. కుక్కర్లో ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఒక కప్పు నీళ్లుపోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఉడికిన కూరగాయ ముక్కల్లోంచి నీటిని వంపి మెత్తగా మెదపాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిబఠాణీలు వేయాలి. బాగా వేగాక కూరగాయల మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోయాలి. పిండిని చిన్నచిన్న ముద్దలు చేసుకుని పూరీల్లా ఒత్తి మధ్యలో కూరపెట్టి అంచుల్ని పొట్లంలా ముడవాలి. వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుంటే వేడివేడి పొట్లి సమోసా సిద్ధం.
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం”