Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీ విధానం
Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీకి కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి:
అర టీస్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్.
Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీ విధానం
ఆలుగడ్డల తొక్కతీసి, ముక్కల్లా కోసి మరిగే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఒక గిన్నెలో చల్లారిన ఆలుగడ్డ ముక్కలు, చిటికెడు ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడానూనెపోసి.. ఆలుగడ్డ ముక్కలను విడివిడిగా దోరగా కాల్చుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి, బాగా వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక.. మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, సోయాసాస్, టమాట కెచప్, చిల్లీ పేస్ట్, అజినమోటో, తెల్లమిరియాల పొడి, వెనిగర్ వేసి అరకప్పు నీళ్లుపోసి బాగా ఉడికించాలి. ఆ మిశ్రమంలో ముందుగా వేయించిన ఆలుగడ్డ ముక్కలను కలిపి పైనుంచి ఉల్లి
కాడల తురుము వేసుకుంటే వేడివేడి ఆలూ మంచూరియా సిద్ధం.
Read More :
“Mexican Rice Recipe | మెక్సికన్ రైస్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

