Mexican Rice Recipe | మెక్సికన్ రైస్ తయారీ విధానం
Mexican Rice Recipe | మెక్సికన్ రైస్ తయారీకి ఏం కావాలి?
బాస్మతి బియ్యం: రెండు కప్పులు, టమాట ప్యూరీ: పావు కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, స్వీట్‌కార్న్, పచ్చి బఠాణీ, రాజ్మా గింజలు: పావు కప్పు చొప్పున, నూనె: మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి: అర టీస్పూన్ చొప్పున, రెడ్ చిల్లీఫ్లేక్స్: ఒక టీస్పూన్, ఆరిగానో: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, తరిగిన ఉల్లికాడలు: పావు కప్పు, టమాట కెచప్: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు
Mexican Rice Recipe | మెక్సికన్ రైస్ తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి. రాజ్మా గింజల్ని నాలుగు గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక చిన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. టమాట ప్యూరీ వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం, చిల్లీఫ్లేక్స్, ఆరిగానో, జీలకర్ర, మిరియాల పొడి.. అన్నీ వేసి బాగా కలిపి నూనె పైకి తేలేంతవరకూ సన్నని మంటపై ఉడికించాలి. బాగా ఉడికిన మిశ్రమంలో క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషంపాటు వేయించి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మరో మూడు నిమిషాలు వేయించాక నాలుగు కప్పుల నీళ్లుపోసి మూతపెట్టాలి. మిశ్రమం సగం ఉడికిన తర్వాత స్వీట్‌కార్న్, పచ్చి బఠాణీ, రాజ్మా, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి బాగా కలిపి మూతపెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత వడ్డించుకుంటే నోరూరించే కలర్‌ఫుల్ మెక్సికన్ రైస్ సిద్ధం.
Read More :
Cabbage 65 Recipe | క్యాబేజీ 65 తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

