రాగి పిండి: ఒక కప్పు, మైదా: అర కప్పు, కరిగించిన వెన్న: పావు కప్పు, బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్, బేకింగ్ సోడా: చిటికెడు, గుడ్లు: రెండు, చక్కెర: అర కప్పు, పాలు: అర కప్పు, ఉప్పు: చిటికెడు, వెనిలా ఎసెన్స్: నాలుగు చుక్కలు, తేనె: రెండు టేబుల్ స్పూన్లు.
ఒక గిన్నెలో రాగిపిండి, చక్కెర, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గుడ్లు, పాలు, ఉప్పు, ఎసెన్స్ వేసి బాగా కలపాలి. కరిగించిన వెన్న కూడా జోడించి మరోసారి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి కొద్దిగా వెన్నవేసి వేడయ్యాక పిండి మిశ్రమం వేసి సన్నని మంటపై రెండువైపులా కాల్చుకోవాలి. వాటి పైనుంచి తేనె
వేసుకుంటే వేడివేడి రాగి పాన్ కేక్స్ సిద్ధం.
Oats Pancake | ఓట్స్ పాన్కేక్ తయారీ విధానం