కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, గోధుమపిండి: అరకప్పు, అరటిపండు: ఒకటి, పాలు: ఒక కప్పు, పెరుగు: రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర: పావు కప్పు, బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా: చిటికెడు, వెనిలా ఎసెన్స్: ఒక టీస్పూన్, గుడ్డు: ఒకటి, ఉప్పు: చిటికెడు, వెన్న: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
ముందుగా ఓట్స్‌ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, గోధుమపిండి, చిదిమిన అరటిపండు, పాలు, పెరుగు, చక్కెర, గుడ్డు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కనపెట్టాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయాలి. మిశ్రమం గట్టిగా ఉంటే మరిన్ని పాలు పోసుకుని దోసె పిండిలా జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ.. వెన్నలో కాల్చుకుంటే ఓట్స్ పాన్కేక్ సిద్ధం.